మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన నేత, మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
short by
Devender Dapa /
06:33 pm on
05 Dec