మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో సైదులుబాబు అనే వ్యక్తి ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, 9వ తరగతి చదివే ఆమె కుమార్తెను కూడా లైంగికంగా వాడుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భవతి కావటంతో 2 నెలల కిందట ఆమె తల్లి సాయంతో రహస్యంగా అబార్షన్ చేయించాడు. ఇటీవల ఆ బాలికకు వివాహం చేసేందుకు ప్రయత్నించగా సఖి కేంద్ర నిర్వాహకులు అడ్డుకున్నారు. వారు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో బాలిక అబార్షన్ విషయం వెల్లడించింది.
short by
srikrishna /
12:18 pm on
03 Dec