UP హాపూర్ జిల్లాలో గంగానది ఒడ్డున ఉన్న బ్రజ్‌ఘాట్‌లో ఫేక్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించిన ఢిల్లీకి చెందిన వస్త్ర వ్యాపారి సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఓ కారులో ప్లాస్టిక్ బొమ్మను మృతదేహం వలె తయారు చేసి తీసుకొచ్చి, దహనం చేసేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఉన్నవారికి అనుమానం వచ్చి చూడగా, నిజం తెలిసింది. బీమా డబ్బుల కోసమే సదరు వ్యాపారి, ఇలా చేయించాడని పోలీసులు తెలిపారు.
short by
Devender Dapa /
10:37 pm on
27 Nov