ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో పెళ్లి వేడుకలో భాగంగా వివాహానికి ముందు వరుడికి పూల దండ వేసిన తర్వాత ఓ వధువు ప్రియుడితో పారిపోయింది. సంప్రదాయం ప్రకారం తొలుత వరుడికి పూలదండ వేసిన ఆమె, బట్టలు మార్చుకుంటానని గదిలోకి వెళ్లింది. అనంతరం ప్రియుడితో వెళ్లిపోయింది. ఆపై తాను ప్రేమించిన వాడితోనే కలిసి ఉంటానని తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఈ విషయంపై వధూవరుల కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పెళ్లి రద్దు అయింది.
short by
Devender Dapa /
10:53 pm on
01 Dec