ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో రోడ్డుపై నిలబడి ఉన్న ఓ మహిళను అటుగా వెళ్తున్న వృద్ధుడు ఒకరు అనుచితంగా తాకాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఇది జరిగిన వెంటనే అప్రమత్తమైన మహిళ, వెంటపడి మరీ ఆ వృద్ధుడిని కొట్టినట్లు వీడియోలో ఉంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడిని స్థానికంగా ఉండే రియాజ్‌గా గుర్తించారు.
short by
Devender Dapa /
10:33 pm on
30 Jun