భాస్కరరావు అనే 30 ఏళ్ల యువకుడు విశాఖలోని గాజువాకలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. శనివారం పక్కింటి యువతి స్నానం చేస్తుండగా భాస్కరరావు వీడియో తీశాడంటూ ఆమె కుటుంబ సభ్యులు అతడిని కొట్టి ఇంట్లో నిర్బంధించారు. కాసేపటికి అతను విగతజీవిగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. భాస్కరరావును కొట్టి చంపారని, ముఖంపై గాయాలు ఉన్నాయని బాధిత కుటుంబం ఆరోపించింది. వారి ఫిర్యాదు మేరకు యువతితో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది.
short by
Sri Krishna /
11:17 am on
02 Feb