For the best experience use Mini app app on your smartphone
నవంబర్ 21 నుంచి పెర్త్‌ వేదికగా జరగనున్న 2025-26 యాషెస్ తొలి టెస్ట్ కోసం ఇంగ్లాండ్ తమ XIIని ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ మార్క్‌వుడ్ ఫిట్‌గా ఉన్నట్లు తేలడంతో 12 మంది సభ్యుల జట్టులో అతడి పేరును చేర్చారు. ఈ జట్టులో ఏకైక స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ చోటు దక్కించుకున్నాడు. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని XIIలో గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్‌, జోఫ్రా ఆర్చర్‌ కూడా ఉన్నారు.
short by / 11:05 pm on 19 Nov
For the best experience use inshorts app on your smartphone