రూ.34 లక్షల విలువైన "ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి" వాచ్ ధరించి బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో కనిపించారు. కాషాయ రంగుతో లిమిటెడ్ ఎడిషన్‌గా ఎథోస్ వాచెస్ సహకారంతో జాకబ్ అండ్ కో ఈ గడియారాన్ని తయారు చేసింది. "వాచీ డయల్‌ను రామజన్మభూమి ఆలయ వివరణ, హిందూ దేవుళ్ల శాసనాలతో జాగ్రత్తగా రూపొందించారు," అని ఎథోస్ వాచెస్ వెబ్సైట్ పేర్కొంది.
short by
Bikshapathi Macherla /
09:13 pm on
28 Jan