హన్మకొండ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ.60 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కాడు. వెంకట్ రెడ్డి హన్మకొండ జిల్లా ఇన్‌ఛార్జి డీఈవోగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓ ప్రైవేట్ స్కూల్‌ను రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వెంకట్ రెడ్డితోపాటు జూ.అసిస్టెంట్ మనోజ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
short by
Srinu /
01:03 am on
06 Dec