రూ.7వేలు లంచం తీసుకుంటుండగా జగిత్యాల జిల్లా పంచాయతీ రాజ్ విభాగంలోని క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అనిల్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంకటేశ్ అనే కాంట్రాక్టర్ సుమారు రూ.23 లక్షల విలువైన నిర్మాణాలకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ కోసం అనిల్‌ను ఆశ్రయించాడు. సర్టిఫికేట్ కోసం రూ.10 వేలు లంచం డిమాండ్ చేసిన అనిల్, తొలుత రూ.3వేలు తీసుకున్నాడు. రెండో దఫా నగదు తీసుకుంటూ దొరికిపోయాడు.
short by
Devender Dapa /
08:18 pm on
30 Jul