For the best experience use Mini app app on your smartphone
టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ వ్యవహారంపై ఆ పార్టీ అధిష్ఠానం నివేదిక కోరింది. ఎంపీ, జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త కలిసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తిరువూరులో గత 10 నెలలుగా జరిగిన ఘటనలపై పూర్తి నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఆ పార్టీ నేత రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే 2 రోజుల్లో రాజీనామా చేస్తానని కొలికపూడి పేర్కొన్న నేపథ్యంలో అధిష్ఠానం ఈ మేరకు స్పందించినట్లు సమాచారం.
short by Srinu / 08:00 pm on 28 Mar
For the best experience use inshorts app on your smartphone