విశాఖ జిల్లా భీమిలి మండలంలో పోలియోతో నడవలేని స్థితిలో ఉన్న 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న వేళ పక్కింట్లో ఉండే 49 ఏళ్ల ఎల్లయ్యరెడ్డి రేప్ చేశాడని పోలీసులు తెలిపారు. మరోవైపు, విశాఖ మధురవాడలో 16 ఏళ్ల బాలికను ఆమెకు పరిచయస్తుడైన 30 ఏళ్ల సాయితేజ ఓ హోటల్‌లో రేప్ చేశాడని పోలీసులు చెప్పారు. బాలిక వెంట వచ్చిన ఆమె తమ్ముడు భోజనం తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ఇది జరిగింది.
short by
Sri Krishna /
12:22 pm on
22 Jan