రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తిరుమల చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహం వద్ద ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. రాష్ట్రపతికి స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి ద్రౌపది ముర్ము తిరుచానూరు వెళ్లి శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
short by
Devender Dapa /
10:22 pm on
20 Nov