రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ స్టేజి సమీపంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేసారం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలు గమనించి, తాను బయటకు దిగిపోయినట్లు ఈ ఘటన జరిగినపుడు డ్రైవింగ్ చేస్తున్న యజమాని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు.
short by
Devender Dapa /
10:58 pm on
27 Mar