For the best experience use Mini app app on your smartphone
బెండకాయలను నీటిలో 8-12 గంటలు నానబెట్టి, పరగడుపున ఆ నీరు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని న్యూట్రిషనిస్ట్ రూపాలి దత్తా తెలిపారు. ఇది ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నీరు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుందని, తద్వారా అతిగా ఆకలి వేయదని దత్తా చెప్పారు. రోజంతా చురుకుగా ఉండటానికి, రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉండడానికి ఈ నీరు దోహదపడుతుంది.
short by srikrishna / 07:42 am on 20 Nov
For the best experience use inshorts app on your smartphone