‘వారణాసి’ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ధర్మం పట్ల, హిందూ దేవుళ్ల పట్ల నమ్మకం లేని రాజమౌళి సినిమాలను హిందువులు బహిష్కరించాలన్నారు. ‘’నీకు విశ్వాసం లేదు కానీ, అదే దేవుళ్లపై సినిమాలు చేసి రూ.కోట్లల్లో సంపాదించుకున్నావు,’' అని రాజాసింగ్ ఆరోపించారు. తన అమ్మానాన్నలకు హనుమంతుడిపై విశ్వాసం ఉంది కానీ.. తనకు లేదని రాజమౌళి ఆ ఈవెంట్‌లో అన్నారు.
short by
Srinu /
10:44 pm on
20 Nov