For the best experience use Mini app app on your smartphone
రాజస్థాన్‌లోని మౌంట్ అబులో గల దిల్వారా జైన ఆలయ సందర్శనకు వెళ్లిన యువతి తొడలను ఓ వృద్ధుడు రహస్యంగా ఫొటోలు తీశాడు. దీన్ని బాధిత యువతి గుర్తించి, అతడి ఫోన్‌లోని గ్యాలరీ ఓపెన్ చేయించగా, అందులో ఆమె ఫొటోలు కనిపించాయి. దీంతో ఆమె ఆ ఫొటోలను డిలీట్‌ చేయించింది. "ఆలయంలో ఇలా చేయడం సిగ్గుగా అనిపించలేదా," అని వృద్ధుడిని ఆమె మందలించింది. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరలవుతోంది.
short by Bikshapathi Macherla / 10:21 pm on 15 Apr
For the best experience use inshorts app on your smartphone