హైదరాబాద్ శివారు కీసర అవుటర్ రింగు రోడ్డు వద్ద బుధవారం లారీ ఢీకొని 35 ఏళ్ల ఏలేందర్ కాళ్లు నుజ్జునుజ్జు కాగా, తనను వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లమని అతను స్థానికులను వేడుకున్నాడు. ఏ ఒక్కరూ ముందుకు రాకుండా సెల్ఫీలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు. యాక్సిడెంట్ అయిన చాలాసేపటికి 108 అంబులెన్స్ వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించగా, తీవ్ర రక్తస్త్రావం కావటంతో అప్పటికే ఏలేందర్ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.
short by
Bikshapathi Macherla /
02:28 pm on
21 Nov