రాత్రిపూట 7 గంటల కంటే తక్కువసేపు నిద్రించే గర్భిణులకు పుట్టే పిల్లలకు ఎదుగుదల సమస్యలు వచ్చే అవకాశమున్నట్టు చైనా పరిశోధనలో వెల్లడైంది. సరిగా నిద్రపోని గర్భిణీలకు పుట్టే పిల్లల్లో మాట్లాడటం, ఇతరులతో కలవటం, కదలికలు, విషయ గ్రహణ నైపుణ్యాలు అబ్బటం ఆలస్యమవుతున్నట్టు తేలింది. గర్భిణులు కంటి నిండా నిద్ర పోవటం చాలా ముఖ్యమని ఈ అధ్యయనం నొక్కి చెబుతోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ పెంగ్ ఝూ చెప్పారు.
short by
Devender Dapa /
08:30 pm on
27 Nov