రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25%గా చేస్తూ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయం తీసుకుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఫలితంగా గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. 2025లో రెపో రేటులో కోత విధించడం ఇది నాలుగోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో ఈ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్‌బీఐ, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
short by
srikrishna /
11:16 am on
05 Dec