రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు పేరిట హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్‌లెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన, సమాజహితమే లక్ష్యంగా శ్రమిస్తున్న ఏడుగురికి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు.
short by
Devender Dapa /
11:40 pm on
16 Nov