For the best experience use Mini app app on your smartphone
అయోధ్యలోని బాలరాముడి గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని పీఎం నరేంద్ర మోదీ ఎగురవేశారు. రామమందిర నిర్మాణం పూర్తయ్యిందనే దానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ జెండా కాషాయవర్ణంలో 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంది. దీనిపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. 
short by srikrishna / 12:15 pm on 25 Nov
For the best experience use inshorts app on your smartphone