సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పరిశీలించి, అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. పాశమైలారంలోని సిగాచీ కెమికల్ పరిశ్రమలో సోమవారం రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 37 మంది చనిపోయారు.
short by
Srinu /
11:35 am on
01 Jul