అన్నమయ్య జిల్లా రాయచోటి బంగ్లా సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్లే మార్గంలో ఆదివారం ఓ యువకుడు మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. పగలగొట్టిన బీరు సీసాను చూపిస్తూ రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి ప్రజలకు భయాందోళన కలిగించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహకారంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
short by
News Telugu /
08:00 am on
24 Nov