రైలు బోగీలో మైనర్ బాలిక పక్కన కూర్చున్న ఓ వ్యక్తి ఆమెను రహస్యంగా అనుచితంగా తాకుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ, ఏ రైలులో జరిగిందనేది ఇంకా ధృవీకరణ కాలేదు. వీడియో తీసిన మరో ప్రయాణికుడు నిందితుడిని ప్రశ్నించగా, చివరకు అతను తన నేరాన్ని పరోక్షంగా అంగీకరించాడు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు బాలికల భద్రతకు పెను సవాల్ అని పేర్కొన్నారు.
short by
/
07:31 pm on
20 Oct