రైళ్లలో విద్యుత్ కెటిల్స్ వాడొద్దని సెంట్రల్ రైల్వే సూచించింది. రైలులో కెటిల్‌లో నూడుల్స్ వండిన మహిళపై చర్యలు తీసుకున్న తర్వాత ఈ మేరకు తెలిపింది. ‘’రైల్లో కెటిల్స్ వంటి హై వోల్టేజ్ ఉపకరణాలు వాడడం నిషేధం. ఇవి విద్యుదాఘాతానికి, అగ్ని ప్రమాదాలకు దారితీయొచ్చు. విద్యుత్ సరఫరాకూ అంతరాయం కలిగించి ఏసీ, విద్యుత్ పోర్టుల పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఇలా చేయడం శిక్షార్హమైన నేరం,’’ అని హెచ్చరించింది.
short by
srikrishna /
02:38 pm on
23 Nov