శబరిమల వెళ్లే భక్తులు రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, కర్పూరం వెలిగించవద్దని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. యాత్రికుల రైళ్ల కోచ్‌ల లోపల కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం, అగరబత్తులు, సాంబ్రాణి పుల్లలు వెలిగించడం వంటివి చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. మండే స్వభావంగల పదార్థాలతో ప్రయాణం చేయడం, వాటిని ఏ రూపంలోనైనా వెలిగించడం నిషేధించినట్లు రైల్వే పేర్కొంది.
short by
Devender Dapa /
05:41 pm on
03 Dec