దేశ రక్షణలో సేవలు అందిస్తున్న సైనికుల గౌరవార్ధం వారికి ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన X ఖాతాలో ప్రకటన చేశారు. రాష్ట్రం నుంచి భారత రక్షణ దళాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ మినహాయింపు కల్పించనున్నట్లు తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పారామిలిటరీ, సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఈ వెసులుబాటు కల్పించనున్నారు.
short by
/
12:27 pm on
12 May