సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సీక్వెల్ జైలర్ 2లో నటుడు విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. దీనిపై మేకర్స్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికీ విజయ్ సేతుపతి.. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది.
short by
/
10:52 pm on
27 Nov