For the best experience use Mini app app on your smartphone
అదానీ గ్రూప్ స్టాక్స్ గురువారం పతనం అయ్యాయి. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు $250 మిలియన్ (దాదాపు రూ. 2,100 కోట్లు) లంచంగా ఇవ్వజూపారన్న ఆరోపణలతో అదానీ గ్రూప్‌ సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసులు నమోదైన నేపథ్యంలో ఆ గ్రూప్‌ స్టాక్స్‌ పడిపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 10%, అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ 17%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ స్టాక్ 20% క్షీణించాయి.
short by Sri Krishna / 10:09 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone