లండన్‌లోని సౌథెండ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ బి200 విమానం కూలిపోయింది. ఇది చిన్నపాటి విమానమని, ఆ సమయంలో అందులో 9 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నట్లు పలు రిపోర్ట్‌లు తెలిపాయి. మంటల్లో ఉన్న విమానం ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ప్రత్యక్ష సాక్షులు అది "అగ్నిగోళం"గా మారిందని చెబుతున్నారు. విమానం నెదర్లాండ్స్‌లోని లెలిస్టాడ్‌కు వెళ్లాల్సి ఉంది.
short by
Srinu /
07:15 am on
14 Jul