‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సాయం లేకుండానే శ్రీతేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాలుడికి అప్పుడప్పుడు జ్వరం వస్తోందని, నిన్నటితో పోల్చితే శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడినట్లు శనివారం కిమ్స్ వైద్యులు బులిటెన్‌లో చెప్పారు.
short by
Devender Dapa /
07:12 pm on
21 Dec