వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీకి పీఎం మోదీ ఇస్తున్న అండదండలు కేంద్ర బడ్జెట్‌లోనూ కొనసాగించారని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం వల్ల రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న ఆ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందన్నారు.
short by
Devender Dapa /
10:57 pm on
01 Feb