విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయ ప్రసాదంగా అందించే పులిహోరలో మేకు ప్రత్యక్షమైంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహా మండపం కింద 4వ కౌంటర్‌లో ప్రసాదం కొని, మెట్లపై కూర్చుని తింటుండగా మేకు ప్రత్యక్షమైందని బాధితుడు తెలిపాడు. దీనిపై అధికారులను నిలదీసి, నిర్లక్ష్యం వీడాలని కోరినట్లు అతను చెప్పాడు. దీనిపై స్పందించిన అధికారులు ఆహార పదార్థాల తనిఖీకి సిబ్బందిని నియమిస్తామన్నారు.
short by
Bikshapathi Macherla /
10:45 pm on
30 Mar