రూ.473 కోట్లతో చేపట్టిన విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులను జూన్ నాటికి పూర్తిచేయాలని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం విమానాశ్రయం 12,961 చ.మీ. విస్తీర్ణంతో ఉందని.. ఇక్కడి నుంచి ఏటా 10 లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. దీనిని 36వేల చ.మీ.కు విస్తరించి.. ఏటా 35 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు.
short by
Devender Dapa /
12:34 am on
19 Apr