For the best experience use Mini app app on your smartphone
పార్వతీపురం మన్యం జిల్లా పాలమెట్ట శివారులో రాగోలు అన్నపూర్ణ అనే వృద్ధురాలి కళ్లలో కారం కొట్టిన గుర్తుతెలియని దుండగుడు ఆమె మెడలో ఉన్న 2 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లియాడని పోలీసులు తెలిపారు. ఆమె పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా ఇది జరిగిందని చెప్పారు. అటుగా వెళ్తున్నవారు వృద్ధురాలికి సాయం అందించారని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు.
short by / 09:39 pm on 28 Nov
For the best experience use inshorts app on your smartphone