శ్రీ సత్యసాయి జిల్లా గౌకనపేటలో హర్షవర్ధన్ అనే 4 ఏళ్ల బాలుడిని మేనత్త భర్త ప్రసాద్ హత్య చేశాడు. ప్రసాద్ కుమారుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, అతడి వైద్యానికి డబ్బులివ్వలేదని బావమరిదిపై కక్ష పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం బావమరిది కుమారుడు హర్షవర్ధన్‌ను కిడ్నాప్ చేశాడు. ఆపై బాలుడిని హత్య చేసి చెట్ల పొదల్లో పడేశాడు. గురువారం ఉదయం బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
short by
Devender Dapa /
06:27 pm on
27 Nov