వైద్యుల ప్రకారం, కొబ్బరి లేదా కొబ్బరితో చేసిన పదార్థాలంటే అలెర్జీ ఉన్నవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలి. ఈ నీళ్లలో ఉండే అధిక పొటాషియం కిడ్నీ సమస్యతో బాధపడేవారికి కూడా తీవ్ర హాని కలగజేస్తుంది. కొబ్బరి నీటిలో ఉండే చక్కెర వల్ల, డయాబెటిస్ రోగులు దీనికి దూరంగా ఉండటం మేలు. అలాగే 6 నెలల్లోపు వయసున్న పిల్లలకు ఈ నీరు తాగించకూడదు. జీర్ణ సమస్యలు, ముఖ్యంగా IBS ఉన్నవారు వైద్యుల సలహాతో కొబ్బరి నీళ్లు తాగాలి.
short by
Srinu Muntha /
07:30 am on
23 Feb