మహబూబాబాద్ జిల్లా హరిపిరాల ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. టీచర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలపడంతో వారు పాఠశాలకు వెళ్లి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. స్థానిక యువకులు నిందితుడిపై దాడి చేయబోగా, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
short by
Bikshapathi Macherla /
08:25 pm on
29 Jan