ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఐ న్యూస్ ఎండీ అరువెల శ్రవణ్‌రావు శనివారం సిట్ విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఈ కేసు నమోదైన వెంటనే ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. విచారణకు సహకరించాలని శ్రవణ్‌రావును సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన శనివారం విదేశాల నుంచి హైదరాబాద్‌కి వచ్చారు.
short by
srikrishna /
02:37 pm on
29 Mar