మహారాష్ట్రలోని పుణె, పరిసర ప్రాంతాల్లో గులియన్-బారీ సిండ్రోమ్ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఒక్క వారంలోనే 100 మందికి పైగా దీని బారినపడగా, కొందరికి వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స చేస్తున్నారు. ఇది సోకితే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నాడుల చుట్టూరా ఉండే మైలీన్ అనే రక్షణ పొరను దెబ్బతీస్తుంది. ఫలితంగా పక్షవాతం మాదిరిగా కండరాలు చచ్చుబడటానికీ దారితీస్తుంది. ఇది నేరుగా ఒకరి నుంచి మరొకరికి సోకదు.
short by
Sri Krishna /
07:16 pm on
28 Jan