మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్‌లో 29 ఏళ్ల రమేశ్, అతడి భార్య 21 ఏళ్ల నిర్మల అలియాస్ శ్రీలక్ష్మి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. రమేశ్ ఉరికి వేలాడుతూ కనిపించగా, పక్కనే శ్రీలక్ష్మి మృతదేహం పడి ఉంది. గర్భిణి అయిన ఆ యువతి గొంతుపై గాయాలున్నాయి. ఇరువురి మధ్య ఘర్షణ కావడంతో ఆమెను భర్తే గొంతు నులిమి చంపేసి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరికి ఈ ఏడాది జూన్‌లో వివాహమైంది.
short by
srikrishna /
11:50 am on
09 Oct