విశాఖ నేవీ గూఢచర్యం కేసులో మరో ఇద్దరు నిందితులకు NIA ప్రత్యేక కోర్టు శిక్షలను విధించింది. పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న విశాఖ నేవీ ఉద్యోగులైన రాజస్థాన్‌కు చెందిన అశోక్ కుమార్, వికాస్ కుమార్‌లకు 11 నెలల జైలు శిక్ష, రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. రూ.5,000 జరిమానా చెల్లించకపోతే మరొక సంవత్సరం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన 15 మంది నిందితులలో 8 మందికి శిక్షలు ఖరారయ్యాయి.
short by
Devender Dapa /
10:43 pm on
25 Nov