దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విశాఖ-విజయవాడ సెక్షన్ మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా 16 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రకటించింది. జనవరి 27-31 మధ్య ఈ రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. రద్దైన రైళ్ల జాబితాలో విజయవాడ- విశాఖ; గుంటూరు - విశాఖ వంటి సర్వీసులు ఉన్నాయి.
short by
Devender Dapa /
10:10 pm on
28 Nov