విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఐఐ-ఏపీ 30వ భాగస్వామ్య సదస్సులో మూడు రోజుల్లో 613 ఒప్పందాలు కుదిరాయని, 12 రంగాల్లో మొత్తం రూ.13,25,716 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా 16,31,188 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. విశాఖ సదస్సులో చేసుకున్న ఒప్పందాలన్నీ వచ్చే మూడున్నరేళ్లలో కార్యరూపం దాల్చేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
short by
srikrishna /
10:55 am on
16 Nov