టాలీవుడ్ నటుడు సాయి దుర్గా తేజ్ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొత్త సంవత్సరం వస్తున్న తరుణంలో శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు చెప్పారు. ఇంతలో ఓ విలేకరి ‘మీ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి కదా’ అని ప్రశ్నించగా.. ‘వచ్చే ఏడాదిలోనే నా పెళ్లి ఉంటుంది,’’ అని సాయి దుర్గా తేజ్ సమాధానమిచ్చారు. ఆయన నటించిన ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.
short by
Srinu /
04:04 pm on
17 Nov