వచ్చే 2-3 ఏళ్లలో దేశంలో 200 కొత్త వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17,500 జనరల్ నాన్ ఏసీ కోచ్‌లు రాబోతున్నాయని తెలిపారు. భారీ మొత్తంలో కేటాయింపులతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని మరింతగా విస్తరించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు.
short by
Devender Dapa /
11:12 pm on
01 Feb