ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వచ్చే కలెక్టర్ల సదస్సులోగా జాబ్ మేళాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి మూడు, ఆరు నెలలకొకసారైనా జాబ్ మేళాలు కచ్చితంగా జరగాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా నైపుణ్య గణన పూర్తికాకపోవడమేంటన్నారు. వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేసేందుకు నమోదు చేసుకున్నవారికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు.
short by
Devender Dapa /
11:46 pm on
27 Mar