దేశంలోనే వరి ఉత్పత్తిలో ఈ ఏడాది తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది 280 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని ఆయన చెప్పారు. స్థానిక అవసరాలు, ప్రజా పంపిణీ ద్వారా సన్న బియ్యం పంపిణీ, కేంద్ర నిల్వల కోసం 60 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల మిగులు ఉంటుందన్నారు.
short by
Bikshapathi Macherla /
10:20 pm on
15 Apr