సోమవారం జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో భారత్ విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీని 35–28 తేడాతో ఓడించి భారత్ ఈ ఫీట్ సాధించింది. భారత మహిళా జట్టు వరుసగా రెండోసారి కబడ్డీ ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం గమనార్హం. 2012లో బీహార్‌లోని పాట్నాలో జరిగిన తొలి ఎడిషన్‌లోనూ టీమిండియా విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ఇరాన్‌ను ఓడించి తొలిసారి విజేతగా అవతరించింది.
short by
Devender Dapa /
10:05 pm on
24 Nov